తెలంగాణ : హైదరాబాద్ : 18ఫిబ్రవరి
సీఎం రేవంత్ రెడ్డి అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పట్నం మహెందార్ రెడ్డి, తెలంగాణ ఫైర్ శాఖ డిజి నాగిరెడ్డి, హోం ప్రనిస్పల్ సెక్రెటరీ జితేందర్, సౌమ్య మిశ్రా ఇతరఅధికారులు, ఫైర్ సిబ్బంది పాల్గొననున్నారు. ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని తెలిపారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం లేకపోవడం మంచిది కాదన్నారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరం అభివృది చెందుతుందన్నారు.
