:ఢిల్లీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల గెలుపోటములపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార భాజపాకు ) 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతంలోనూ ఆ పార్టీ సీట్లు, ఓట్లశాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. వార్తాసంస్థ పీటీఐ ఎడిటర్లకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
