తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 24( హింస)
సూర్యాపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ అర్రూరి సైదులు(41) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెన్ పహాడ్ మండలంలోని తన స్వగ్రామమైన ధర్మపురంలో గల తన వ్యవసాయ క్షేత్రం వద్ద బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల వల్ల భార్యభర్తలు ఇరువురు గొడవ పడేవారని స్థానికలు తెలిపారు.
