







తిరుపతి:11 జనవరి (హిం.స) తల్లి ఆరోగ్యం బాగోలేదని అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ సానుభూతిపరుడు యశశ్విని ఏపీ సీఐడీ నేడు తిరుపతికి పిలిపించింది.
డిసెంబర్ 23న విమానం దిగగానే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో యశస్విని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ యశస్వి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో యశ్‌పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి ఆయనను ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేశారు.
అరెస్ట్ తర్వాత యశ్‌ను గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. కోర్టులో హజరు పరచగా న్యాయమూర్తి రిమాండును తిరస్కరించి 41 ఏ నోటిస్ ఇవ్వాలని ఆదేశించారు. యశ్ పాస్‌పోర్టును సైతం అతనికి తిరిగి ఇచ్చి వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు యశ్‌ను విచారణ నిమిత్తం తిరుపతి సీఐడీ కార్యాలయానికి అధికారులు పిలిపించారు. యశ్ కోసం పెద్ద ఎత్తున సీఐడీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఆయనకు 41ఏ నోటీసు ఇచ్చి సీఐడీ పంపించేసింది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్
