.దిల్లీ, 07,జనవరి (హిం.స)అయోధ్యలో రాములొరి ఆలయం ప్రారంభించే గడువు దగ్గరపడుతోన్న సమయంలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ అక్కసు వెల్లగక్కింది
ఆలయం ప్రారంభోత్సవ ఘట్టం నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ముస్లింలు ఇళ్లలోనే ఉండాలని కోరింది. ముస్లింలకు బీజేపీ అతిపెద్ద శత్రువుగా అభివర్ణించింది. అయోధ్యలో (Ayodhya) ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నందున ఈ నెలలో ముస్లింలు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని మరీ మరీ సూచించింది. రామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహాం నెలకొల్పారని, దర్శించుకునేందుకు లక్షలాది మంది బస్సులు, ట్రైన్, విమానాల ద్వారా అయోధ్యకు వస్తారని, శాంతియుతంగా ఉండాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు, డుబ్రీ ఎంపీ బాబ్రుద్దీన్ అజ్మల్సూచించారు. ముస్లింలకు బీజేపీ పెద్ద శత్రువు అని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
