తిరుమల,07 జనవరి (హిం.స) టీటీడీ నిబంధనలను కొందరు అధికార పార్టీ కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. శనివారం శ్రీబ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాలస్వామి మఠం ఎదుట నిలిపి ఉంచిన ఏపీ02ఏపీ 3699 అనే వాహనం వెనుక ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్ ఉంది. తిరుమలకు వచ్చే వాహనాలను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది పరిశీలించి.పార్టీల కండువాలు, స్టిక్కర్లు, అన్యమతాల చిహ్నాలు గుర్తించి తొలగించి పంపుతారు. ఈ వాహనం స్టిక్కర్‌తోపాటు కొండపైకి చేరుకున్నా పట్టించుకునేవారు లేరు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
