గౌహతి ,16,మార్చి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ సోషల్ మీడియా పోస్ట్లపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి విరాళం ఇచ్చిన సంస్థతో అస్సాం ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసిందని పేర్కొంటూ నాగోన్ కాంగ్రెస్ ఎంపీ బోర్డోలోయ్ ఎక్స్.కామ్లో పోస్ట్ చేశారు. ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ ఓ యాష్ ట్యాగ్ను జోడించారు.
దీనిపై అస్సోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్లు పెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమైనవి అంటూ కొట్టి పారేశారు.
