ముంబై, 7 జనవరి (హిం.స)
ముంబై ట్రాన్స్-హార్బర్ సీ లింక్ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 12వ తేదిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వంతెనను ప్రారంభించబోతున్నారు.
తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నంలో దేశంలోనే అత్యంత పొడవైన రహదారి వంతెన ముంబయి ట్రాన్స్-హార్బర్ లింక్ నిర్మాణాన్ని చేపట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. మొత్తం రూ.17,843కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ముంబయిలోని సెవ్రిలో ప్రారంభమై, రాయగఢ్ జిల్లాలోని నహవ శేవ(నవీముంబై) వద్ద ముగుస్తుంది. మొత్తం 21.8కిలోమీటర్ల వంతెనలో సముద్రంపైన 16.5కిలోమీటర్లు, నెలపైన మరో 5.5కిలోమీటర్ల వంతెన నిర్మాణం జరిగింది.
హిందూస్తాన్ సమాచార్, సంధ్యా
