దిల్లీ, 14,,జనవరి (హిం.స)అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని బాబ్రీ మసీదు కేసులో ముస్లింపక్ష కక్షిదారు ఇక్బాల్ అన్సారీ తెలిపారు. ‘ఈటీవీ భారత్’తో ఆయన మాట్లాడుతూ.. ఆలయ వేడుకకు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడం తమ కర్తవ్యమన్నారు
బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక పాత విషయాలకు ఇప్పుడంత ప్రాధాన్యం లేదన్నారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
