ఢిల్లీ : 4 ఫిబ్రవరి ( హింస) రాష్ట్ర హోదా కల్పించాలంటూ లఢఖ్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌తోపాటు మరో మూడు ప్రధాన డిమాండ్లను కూడా నిరసనకారులు వినిపిస్తున్నారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు, లడఖ్-కార్గిల్‌లకు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయింపు అనే డిమాండ్‌లను నిరసకారులు లేవనెత్తుతున్నారు.ఈ క్రమంలో నిరసనకారులు ఆదివారం లఢఖ్ అంతటా బంద్‌కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) బంద్‌కు పిలుపునిచ్చింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ జనవరి 23న కేంద్ర హోంశాఖకు మెమోరాండం కూడా సమర్పించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం 2019 నాటి జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు ముసాయిదాను కూడా ఇచ్చారు.
