దిల్లీ,16,జనవరి (హిం.స)పొగమంచు కారణంగా రాష్ట్ర రాజధానిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండగా.. చాలామట్టుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులు.. విమానయాన సంస్థల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనా చూశాం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దిద్దుబాటు చర్యకు దిగింది.
మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్న సమయంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు చెబుతూనే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెబుతూ కొన్ని డీజీసీఏ సిఫార్సులు విడుదల చేసింది.
తాజాగా పొగమంచు ఎఫెక్ట్తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. లాంజ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో.. విమానం గనుక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
