



పెనుకొండ: 16 జనవరి (హిం.స)శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్) ఇక్కడ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం ఆసక్తి చూపిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో తొలి అడుగు పడింది. 2015 ఏప్రిల్‌లో ఆనాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి ఆధ్వర్యంలో నాసిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
