తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 20( హింస)
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరపున తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానం పంపారు. ఇక ఇప్పటికే జనవరి 22న జరగనున్న రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయోధ్య రాముడు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వివిధ రూపాల్లో సేవలు అందుతున్నాయి. ట్రస్టు ఆలయ ప్రారంభోత్సవానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక కూడా పంపారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
