ఢీల్లీ, 1 జనవరి (హిం.స)
జపాన్లో కొత్త ఏడాది మొదటి రోజున భారీ భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య జపాన్లో రిక్టర్ స్కేల్2పై సోమవారం 7.6 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా ఎన్హెచ్కే వెల్లడించింది.
భూకంపంతో పశ్చిమ తీరానికి జపాన్ వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీచేసింది. జపాన్ వాతావరణ సంస్థ పశ్చిమ తీర ప్రాంతాలైన ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్లకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఇషికావా ప్రిఫెక్చర్లోని నోటోలో సముద్రపు అలలు 5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
