
అమరావతి: 01 జనవరి (హిం.స(అబద్దాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గుర్తించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పెన్షన్లపై ఇంకెన్నాళ్లీ నీతిమాలిన రాతలు. రూ.3వేల హామీపై మాట తప్పి ఒక్కొక్కరికి రూ.30వేలను జగన్రెడ్డి ఎగనామం పెట్టారు. నిజం చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం జగన్రెడ్డిని వేధిస్తోందన్నారు. రూ.3వేలు పెన్షన్ హామీపై అధికారంలోకి రాగానే మాట తప్పారని మండిపడ్డారు. జగన్రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీనీ తుంగలో తొక్కారన్నారు. మాట తప్పి మడమ తిప్పి ఒక్కొక్కరికీ రూ.30వేలు ఎగనామం పెట్టారని చెప్పారు. ఇప్పుడు పెన్షన్ దారులకు లేఖలోనూ పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రూ.200 పెన్షన్ రూ.1800 పెంచి రూ.2000 చేశారని అన్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్
