ఢిల్లీ నకిలీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్లుగా అవతారమెత్తిన కొందరు వ్యక్తులు ఒక వ్యాపారవేత్తను బెదిరించి బంధించారు. అసహజ శృంగారానికి పాల్పడటంతోపాటు అతడి నుంచి లక్షలు దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి కొరియర్ బిజినెస్ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి అతడికి ఫోన్ వచ్చింది. డీఆర్‌ఐలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న తుషార్ సక్సేనాగా పరిచయం చేసుకున్నాడు. వ్యాపార భాగస్వామిగా ఉండి విడిపోయిన ప్రశాంత్‌తో సెటిల్ చేసుకోవాలని, రూ.50,000 చెల్లించాలని డిమాండ్ చేశాడు.
