తెలంగాణ, నిజామాబాద్ 20 ఆగస్టు (హి.స.)
నిజామాబాద్ జిల్లాలోని ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో
బుధవారం కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా గ్రామంలోని పీహెచ్ సెంటర్ను సందర్శించి, ప్రజలకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. అనంతరం సహకార సంఘం ఎరువుల గోదాంను తనిఖీ చేసి, అక్కడ నిల్వ ఉన్న ఎరువుల పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు
