తిరుమల 15 అక్టోబర్ : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. నేడు బంగారు తిరుచ్చి పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు శ్రీవారు.
