హైదరాబాద్: 14 ఏప్రిల్ (హిం.స)ఛత్తీస్‌గఢ్‌లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)పై రాయ్‌పుర్ సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితుల జాబితాలో 12వ స్థానంలో మేఘా సంస్థను చేర్చింది. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ)కు చెందిన 8 మంది అధికారులతోపాటు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలోని మెకాన్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరిపైనా కేసు నమోదైంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా నాగర్నార్‌లోని ఎన్‌ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ (ఎన్‌ఐఎస్‌పీ) ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల జారీ విషయంలో అధికారులకు మేఘా లంచమిచ్చిందంటూ అందిన ఫిర్యాదుపై ఎన్‌ఎండీసీ విశ్రాంత ఈడీ ప్రశాంత్ దశ్, జీఎం(ఫైనాన్స్) రాజశేఖర్, మేనేజర్(ఫైనాన్స్) సోమ్‌నాథ్ ఘోష్, ఎన్‌ఐఎస్‌పీ డైరెక్టర్(ప్రొడక్షన్) దిలీప్‌కుమార్ మొహంతి, డీజీఎం ప్రదీప్‌కుమార్ భూయాన్, డిప్యూటీ మేనేజర్ నరేశ్‌బాబు, సీనియర్ మేనేజర్ సువ్రో బెనర్జీ, సీజీఎం కృష్ణమోహన్, మెకాన్ సంస్థ విశ్రాంత ఏజీఎం(కాంట్రాక్ట్స్) సంజీవ్ సహాయ్, విశ్రాంత డీజీఎం(కాంట్రాక్ట్స్) ఇలవరుసు, మేఘా జీఎం
