అమరావతి, డిసెంబరు 29 (హిం.స) పోలింగ్ జరిగే పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలంటూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చర్యలు ప్రారంభించింది. పోలింగ్ జరిగే బడుల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, సాకెట్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. దివ్యాంగుల కోసం పోలింగ్ జరిగే గదులకు ర్యాంపులు నిర్మించాలని ఆదేశించింది. ఇంకా ఏవైనా అవసరమైతే స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ (ఎస్‌ఎంఎఫ్) ఉపయోగించి జనవరి 31లోగా మరమ్మతులు పూర్తిచేయాలని, ఏవైనా లోపాలుంటే ప్రధానోపాధ్యాయులే బాధ్యులవుతారని హెచ్చరించింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
