యాదగిరిగుట్ట, 01 జనవరి (హి.స.)
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యాదగిరిగుట్టలోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు పూజల అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని స్వామివారిని ప్రార్ధించినట్లు మంత్రి తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు
