తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 22( హింస)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే వివక్షతోనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంకు అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుని దగ్గర రాజకీయాలు తగదని దేవుడు ముందు అందరూ సమానమేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
