దిల్లీ,22,జనవరి (హిం.స) అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్షప్రసారం, ప్రత్యేక పూజలు నిషేధిస్తూ జారీ చేసిన మౌఖిక ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సోమవారం సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై అధికారులు చట్టానికి లోబడి వ్యవహరించాలని ఆదేశించింది. నూతనంగా నిర్మించిన అయోధ్య రామమందిరంలో సోమవారం నాటి క్రతువుల ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడులో నిషేధిస్తున్నట్లు స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. జనవరి 20 నాటి మౌఖిక ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్పై సుప్రీం స్పందించింది. తమ ప్రభుత్వం నుంచి ఈ తరహా ఆంక్షలు ఏవీ లేవని, ఇదంతా రాజకీయ ప్రేరేపితమని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
