



గురజాల:15 జనవరి (హిం.స) ఓటమి భయంతో వైసీపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత, పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. ‘‘తెదేపా ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలోనే ఉంది. గురజాల నుంచి అనేక సార్లు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చింది. చివరి శ్వాస వరకూ ఈ పార్టీలోనే కొనసాగుతా. ఇప్పటికైనా వైకాపా సోషల్ మీడియా ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలి’’ అని యరపతినేని అన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
