బెంగళూరు, 17 జనవరి (హిం.స) మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో బాగంగా చివరి మ్యాచ్ ఈరోజు (జనవరి 17) భారత జట్టు, అఫ్గానిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. మరోవైపు ఈ మ్యాచులోనైనా గెలవాలని ఆప్గాన్ ఆటగాళ్లు చూస్తున్నారు. ఎలాగైనా భారత ఆటగాళ్లను కట్టడి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి మరి.
అఫ్గానిస్థాన్తో జరుగుతున్న సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు గెలిచిన భారత జట్టు 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు మూడో మ్యాచ్లోనూ గెలిస్తే అఫ్గానిస్థాన్ను క్లీన్స్వీప్తో ఓడించడం ఖాయం. జూన్లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్కు ముందు భారత్కి ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం.
హిందూస్తాన్ సమాచార్, సంధ్యా
