దిల్లీ,, 17 జనవరి (హిం.స).గ్లోబల్ మార్కెట్ బలహీన ధోరణి కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 21650 దిగువన ప్రారంభం కాగా… ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,628 పాయింట్లు నష్టపోయి 71,500కి పడిపోయింది. నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి 21,571కి దిగజారింది. ఇటీవల కాలంలో వరుసగా రికార్డు స్థాయిలో సాక్ట్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ షేర్లలో భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టిపిసి, ఐటిసి టాప్ గెయినర్లలో ఉండగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో భారీ నష్టాలను చవిచూశాయి.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
