తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 2( హింస)
83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్-2024) హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ తెరవబడుతుంది. అయితే.. ఈ ఎగ్జిబిషన్‌కు నగరం నలుమూలల నుంచి సందర్శకులు పోటెత్తారు. ఇదిలా ఉండగా.. ఎప్పటిలాగే సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మెట్రో స్టేషన్లలో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
