



అమరావతి:19 జనవరి (హిం.స) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాలో అత్యధికంగా ఎస్సీ రిజర్వుడు స్థానాలకు ఇన్ చార్జీలను మార్చింది.
నాలుగో జాబితాలో ఎస్సీ రిజర్వుడులో 1 ఎంపీ 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. తాజాగా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది.
సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. శింగనమల, నందికొట్కూరు, తిరువూరు, మడకసిర, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచేయి చూపించింది. శింగనమల (ఎస్సీ రిజర్వడ్) సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. శింగనమల అసెంబ్లీ సమన్వయ కర్తగా ఎం.వీరాంజనేయులను నిమామించింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
