,దిల్లీ,19,జనవరి (హిం.స) భారత్ – మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో కీలక పరిణామం నెలకొంది. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉగాండా రాజధాని నగరం కంపాలాలో మాల్దీవుల విదేశామంగ మంత్రి మూసా జమీర్తో భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. రెండు రోజుల నామ్ శిఖరాగ్ర సదస్సులో వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఇక, ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్( ట్విట్టర్ ) వేదికగా తెలియజేశారు. అయితే, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్తో జరిగిన భేటీలో భారత్ -మాల్దీవుల సంబంధాలపై స్పష్టమైన సంభాషణ జరిగింది అని జైశంకర్ తెలిపారు. నామ్ (NAM) సంబంధిత అంశాలను కూడా చర్చించామన్నారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
