పులివెందుల, 30 డిసెంబర్ (హిం.స)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న వంటగ్యాస్ ఈ కేవైసీ కి సంబంధించి వస్తున్నటువంటి ప్రజలకు గ్యాస్ ఏజెన్సీలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు శనివారం ఆయన హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ ఈ కేవైసీ కి చేయించుకుంటున్నటువంటి వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో వస్తున్నారని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
