నల్గొండ, 04 జనవరి (హి.స.)
నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని నర్సాపురం గ్రామ శివారులో లారీ బైక్ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయి, దాచారం గ్రామానికి చెందిన బోళ్ల బన్నీ ఇద్దరు తమ పల్సర్ బైక్ పై భువనగిరికి వెళుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుండి కూకట్ పల్లి కి ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ నర్సాపురం గ్రామ శివారులో వారు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. —————
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు
