యాదగిరిగుట్ట, 23 డిసెంబర్ (హి.స.)
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో
యాదరిగిగుట్ట లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన సభను నిర్వహించేందకు ఇవాళ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ల ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
అయితే ఆలయ ఆవరణలో రాజకీయ ఫ్లెక్సీలు పెట్టడానికి నిషేధం ఉన్నప్పటికీ ఇలా అడ్డగొలుగా ఫ్లెక్సీలు పెట్టడం ఏంటని బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు కలసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించేశారు. ఈ ఘటనతో ఇరు పక్షాల నేతలు, కార్యకర్తల బాహాబాహీకి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు
