హైదరాబాద్,):, 12 డిసెంబర్ (హి.స.)
దువ్వాడ మాధురి శ్రీనివాస్‌కిబిగ్ షాక్ తగిలింది. నిన్న(గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(JBIET) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్‌హౌస్‌లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు పలువురు ప్రముకులు హాజరైనట్లు సమాచారం.
ఈ క్రమంలో బర్త్ డే పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే భగ్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ బర్త్ డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్క బాటిళ్లను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ మాధురి శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
