ఢిల్లీ, 12 డిసెంబర్ (హి.స.)
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధితులకు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. వారిలో 9మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు. బస్సు అదుపుతప్పి లోయలో పడటం వల్ల ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు నగరం మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ నెల 6న 39 మంది యాత్రికులతో బస్సు చిత్తూరు నుంచి బయలుదేరగా ఏడు రోజుల పాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరగా ప్రమాదం జరిగింది.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
