
అమరావతి, జనవరి 2(హిం.స) తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్
మొబైల్ ఫోన్ తీసుకుని పోలీసులు బెదిరించడంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
మంగళవారం కిరణ రాయల్ వేసిన పిటీషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తన మొబైల్ ఫోన్ డాటాను మార్ఫింగ్ చేసి విడుదల చేస్తామని బెదిరిస్తున్నారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు.
మంత్రి రోజా, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే డాటా విడుదల చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని పిటీషన్లో తెలిపారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
