విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి కరోనా విపత్కర సమయంలో దేవుడిలా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదుకొని ప్రాణ బిక్ష పెట్టారని వైసీపీ సీనియర్ నాయకులు గుజరాపు రవి అన్నారు. ఆసీల్ మెట్ట ఎమ్మెల్యే వాసుపల్లి కార్యాలయంలో ఆదివారం ఉదయం 38వ వార్డు సోల్జర్ పేటకు చెందిన 50 మందికి పైగా యువకులు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గుజరాపు రవి మాట్లాడుతూ సేవకు నాయకత్వానికి నిజమైన ప్రతిరూపం మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అని, ఆయన ఈ నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తన కార్యకర్తలైన నాయకులైన దక్షిణ ప్రజలు అంటే అమితమైన ప్రేమ చూపిస్తారని, ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే మా నాయకుడిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి జగనన్నకు బహుమతిగా అందజేస్తామన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా తనను నమ్మే పార్టీలో భారీగా చేరుతున్న దక్షిణం నియోజకవర్గ యువకుల అందరికీ రుణపడి ఉంటానని, మళ్లీ ఎమ్మెల్యేగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తానని ఎమ్మెల్యే వాసుపల్లి తెలిపారు.
