మైసూరు, 2 జనవరి (హిం.స)
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని జనవరి 22న ప్రారంభించనున్నారు. రామమందిరంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలను.. ముగ్గురు శిల్పులు చెక్కగా.. కర్ణటక మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామలల్లా విగ్రహాన్ని గర్భ గుడిలో ప్రతిష్టించడానికి ఎంపిక చేశారు.
ఈ విషయాన్ని రామజన్మ భూమి ట్రస్ట్ సమాచారం ఇచ్చింది. ఓటింగ్ ద్వారా రాంలల్లా విగ్రహాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విగ్రహాన్ని జనవరి 22న ప్రతిష్ఠించనున్నారు. MBA గ్రాడ్యుయేట్ అయిన అరుణ్ యోగిరాజ్ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి తన కుటుంబ వారసత్వంగా వస్తున్న శిల్ప కళా వృత్తిని ఎంచుకున్నాడు. ఇప్పుడు అతను అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్టించే రామ లల్లా మూర్తిని చెక్కాడు.
మైసూరుకు చెందిన అరుణ్తో పాటు బెంగళూరుకు చెందిన జిఎల్ భట్, రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే కూడా ఈ రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కారు. విగ్రహం పొడవు 51 అంగుళాలు, విగ్రహం మొత్తం ఘరా 8 అడుగుల ఎత్తు .. మూడు అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
