రాజమహేంద్రవరం , జనవరి 14 (హిం.స) రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాపులకు 75 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని కాపునాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తాడివాక రమేష్‌నా యుడు డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపుల జనాభా దామాషా 27 శాతం ప్రకారం అన్ని రాజకీయపార్టీలు సీట్లు కేటాయించాలని, నామినేటెడ్ పోస్టులతో పాటు అన్నిరంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే రాజకీయ పార్టీలకే తమ మద్దుతు ఉంటుందన్నారు. రాజ్యాధికారంలో వాటా పొందడంతో పాటు రెండేళ్లు పవర్ షేరింగ్ విధానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టి తీరాలని డిమాండ్ చేశారు.
కాపునాడు రాష్ట్ర కన్వీనర్ సిద్దా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ ఎవ్వరితో పొత్తుపెట్టుకున్నా అభ్యంతరంలేదుకానీ అంతి మంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
