న్యూఢిల్లీ: ,28, జనవరి ( హిం.స)ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. ఇండియా కూటమికి చెందిన పార్టీల ముఖ్య నేతలు శనివారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమిని మరింత బలోపేతం చేయడం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, కూటమికి కన్వీనర్ నియామకం అంశాలపై వారు చర్చించారు. భాగస్వామ్య పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల పరిష్కారంపైనా సమావేశం దృష్టి సారించింది.
కూటమి అధినేత ఎంపిక విషయంలో ప్రతిపక్ష నేతలంతా తీవ్ర చర్చలు జరిపి.. ఖర్గేను చైర్‌పర్సన్‌గా నియమిస్తూ నిర్ణయించారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయం ఇంకా తేలలేదు. సీట్ల పంపకాలపై నేతలు చర్చలు జరిపినప్పటికీ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు.
హిందుస్థాన్ సమాచార నాగరాజ్
