తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ జనవరి:28(హిం స) గుంజల్ పహాడ్ గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్, జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి మొండోని రాయి తాండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన చిన్న కొడుకు ఇలా చెబితే అలా గ్రామ పంచాయతీలు చేశారు
పరిపాలన సౌలభ్యం పేరిట గ్రామపంచాయతీలను ఆశాస్త్రీయంగా ఏర్పాటు చేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తీరుపట్ల ఆక్షేపనలు వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని చౌదరిగుడ మండలం గుంజల్ పహాడ్ గ్రామంలో ప్రభుత్వ నిధులతో అంగన్వాడి భవనాన్ని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు ఫరుక్ నగర్ మండలం మొండొనిరాయి తాండ గ్రామంలో గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఏర్పాటును అశాస్త్రీయంగా గత ప్రభుత్వం చేపట్టిందని విమర్శలు వ్యక్తం చేశారు. పరిపాలన సౌలభ్యం పేరిట ఆమోదయోగ్యముగా లేని కొన్ని గ్రామాలను గ్రామ పంచాయతీగా చేశారని అవసరమైన చోట వదిలేసారని ఈ సందర్భంగా అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జజెడ్పి చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమం కోసం ప్రభుత్వ కృషి చేస్తుందని ఆమె అన్నారు. చిన్నారులను మహిళలకు పౌష్టికాహారం అందించే విధంగా శిశు సంక్షేమ శాఖ అధికారులు పనిచేయాలని ఇక్కడ సంబంధిత అధికారిని నాగమణి తన శాఖ ద్వారా మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నట్టు తనకు తెలుస్తుందని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగమణి, చైర్మన్ చిట్టెం దామోదర రెడ్డి, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
