అమరావతి, 08 ఫిబ్రవరి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 11 నుంచి ‘‘శంఖారావం’’ పేరిట యువనేత ఎన్నికల ప్రచారం చేయనున్నారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేష్ ప్రణాళికలు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ శంఖారావం ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ‘‘శంఖారావం’’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను తెలుగుదేశం గురువారం విడుదల చేసింది.
