శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఫిబ్రవరి 18 : రైతులు నష్టపోకుండా పరిహారం ఇస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ లతో కలిసి మూలపేట పోర్టు రైల్వే ట్రాక్ కు అవసరమైన భూ సేకరణకు సంబంధించి కూర్మనాదపురం, యామలపేట, పోతునాయుడుపేట, కోటపాడు, కాశీపురం, రాజపురం గ్రామాల ప్రజలతో భూములు ధరలపై ఆయన సమావేశం నిర్వహించారు.
పోర్టు, రోడ్డులకు అవసరమైన భూ సేకరణ చేయడమైనదన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం ఎంత ఉంటుందో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అంతకు మించి ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ ఆయా గ్రామాల నుండి ఎవరు వచ్చింది తెలుసుకొని ఆరు గ్రామాల నుండి 72 ఎకరాలు భూమి కావలసి ఉందని చెప్పారు. పంటల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి పరిశీలించినట్లు వివరించారు. రైతులు నష్టపోకుండా న్యాయం చేస్తామని చెప్పారు. పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు రైలు ట్రాక్ అనుసంధానంగా ఉండే విధంగా భూ సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. ముంపు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.
