హైదరాబాద్ మే : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రావడం కూడా కష్టమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో ఆ పార్టీకి మరోసారి అవకాశమిస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని హెచ్చరించారు. రిజర్వేషన్ల పరిరక్షణ, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటున్న భారతీయుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఆరోపించారు.
