విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ఆం ధ్ర రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి శ్రీరామరాజ్యాన్ని తీసుకురావాలని దక్షణ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. శ్రీరామ నవమి పురస్కరించుకునీ వాసుపల్లి గణేష్ కుమార్, కుమారుడు వాసుపల్లి సూర్య సతీసమేతంగా జగదాంబ జంక్షన్ అంబికా బాగ్ శ్రీసీతా రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలో బుధవారం జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు ఆయన పాల్గోని పూజలు చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వయంగా భక్తులకు వడ్డించారు.
. అలాగే శ్రీరాముని ఆశీస్సులతో ఈ నెల 20 వ తేదిన శనివారం ఉదయం 10 గంటలకు శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి పాదాల చెంత నుండి నామినేషన్ ఉత్సవ్ మొదలై గోశాల ఆసుపత్రి, పంజాబ్ జంక్షన్ టౌన్ కొత్తరోడ్ మీదుగా పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ వారి ఆశీస్సులు తీసుకుని టర్నర్ చౌట్రిలో గల ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి నామినేషన్ వేస్తామన్నారు. టిడిపి, జనసేనా పార్టీ లు ఎన్నికలు తరువాత నామరూపాలుండవన్నారు. జగనన్న ప్రభుత్వం రావడం, వారంతా వైసిపి లో చేరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు, ఆలయ చైర్మన్లు, వివిధ ఆలయ కమిటీ సభ్యులు, వైసిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
