తెలంగాణ: వినోదం; ఏప్రిల్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2898 ఏడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతోంది. కల్కి 2898 ఏడీ ఆంధ్ర, తెలంగాణ హక్కులు ఏకంగా 190 కోట్ల రూపాయల దాకా
అమ్ముడవుతున్నాయని సమాచారం. ఖచ్చితంగా ఇది ఒక సూపర్ రికార్డ్
అనే చెప్పాలి. కల్కి మూవీతో ప్రభాస్ కొత్త
రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేసుండగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్
అవుతున్నాయి.కల్కి 2898 ఏడీ సినిమా
బాహుబలి2 రేంజ్ సినిమా అని ఈ సినిమాకు ఎక్కువ మొత్తం ఖర్చు అయినా కలెక్షన్లు మాత్రం భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని ప్రభాస్
అభిమానులు భావిస్తున్నారు. కల్కి 2898 ఏడి సినిమా నుంచి ట్రైలర్ లేదా మరికొన్నిఅప్
డేట్స్ వస్తే ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అన రేంజ్ లో అంచనాలు భారీగా పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని
ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
