విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఫిబ్రవరి 21 : ఫోర్జరీ ఇంటి పట్టాల స్కాంపై దర్యాప్తునకు జీవీఎంసీ అధికారులు వెనకడుగు వేస్తున్నారని ఆర్.టి.ఐ యాక్టివిస్ట్ రెడ్డి వెంకట్రావు అన్నారు. జీవీఎంసీ జోన్ – 5 రెవిన్యూ విభాగంలో 132 ఇండ్ల పట్టాల ఫోర్జరీకి పాల్పడినట్టు ఆర్.టి.ఐ ద్వారా సేఖరించిన సమాచారాన్ని ఆధారాలతో బుధవారం వి జె ఎఫ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిభందనల ప్రకారము భవనములను నిర్మాణము చేసుకొని ఇంటి పన్ను విధించమని జీవీఎంసీ రెవిన్యూ విభాగముకి సంబందిత పత్రములు సమర్పించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న, అర్థం కాని సాంకేతిక పదాలతో కొర్రీలు వేస్తూ రిజెక్ట్ చేస్తుంటారని, అధికారుల ముందు బాధను తెలియ చేయాలని వెళ్తే మరొక్కసారి దరఖాస్తు చేసుకోమని సలహా ఇస్తుంటారన్నారు. దరఖాస్తుదారులు సచివాలయం, జోనల్ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా కొన్ని నెలల పాటు పన్ను విధించుకోలేని పరిస్తితి ఉందని, అయితే నిభందనలకు విరుద్ధంగా నిషేదిత ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేసిన ఆక్రమణదారులకు కొన్ని రోజులలోనే నకిలీ ఇంటి పట్టాలతో ఇంటి పన్నుల పేరు మార్పు చేసి, జోన్- 5లోని కొందరు రెవిన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం 100 చదరపు గజాల గల అక్రమ నిర్మాణములకు జీ.ఓ నెం 296, 388 అనుసరించి నిభందనల ప్రకారము అర్హులయిన వారికి క్రమబద్ధీకరిస్తూ ఆదునిక సాంకేతిక పరిజ్ఞానముతో జియో టాగింగ్, బర్కాడ్లు, గూగుల్ మేప్స్ తదితర అంశంములతో పట్టాలను మంజూరు చేసి అందజేసి, అక్రమ నిర్మాణదారులకు పట్టాలను మంజూరు చెయ్యకుండా నిరాకరించిందని తెలిపారు. జోన్ లోని కొంతమంది రెవెన్యూ సిబ్బంది అర్హులయిన వారి మంజూరు కాబడిన ఇంటి పట్టాలను జియో టాగింగ్, బర్కాడ్లు, గూగుల్ మప్స్, లబ్దిదారుని పేర్లు ఫోర్టరీ, టాంపరింగ్ చేసి అనర్హులయిన కబ్జాదారుల పేరులు, హద్దులు వాటిలో నమోదు చేసి జోన్ లోని 34, 35, 37, 38, 47, 48, 49 వార్డులలో గల వందలాది మందికి అడ్డగోలుగా ఇంటిపన్నులు వేశారన్నారు.
2019 ఏప్రిల్ నుండి 2021 జూన్ వరకు 423 నకిలీ ఇంటి పట్టాలతో మ్యుటేషన్ లు డాక్యుమెంట్లు లేకుండా జరిపారని, ఒక్కొక పుస్తకానికి 30 వేలు నుండి 50 వేలు చొప్పున చేతులు మారినట్టు తెలిపారు. వీటిపై అప్పటి జడ్సీ మల్లయ్య నాయుడు, డీసీఆర్ నల్లనయ్య, , ఏడీసీ సన్యాసి రావుకు ఫిర్యాదులు అందిన,
సర్వ సభ్య సమావేశంలో చర్చలు జరిపిన చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై ఓ న్యాయవాది ఆర్ టి ఐ యాక్ట్ ద్వారా సమాచారం కోరిన, రెవెన్యూ అధికారులు ఇవ్వలేదని, కమీషన్ ముందు హాజరుకావాలని సమాచార కమిషనర్ ఆదేశించిన హాజరు కాలేదని తెలిపారు. గైర్హాజరైనందున సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ను సమాచార కమిషన్ ఆదేశించిన చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. నకిలీ ఇళ్ల పట్టాలను సీతమ్మధారలోని ఎమ్మార్వో కార్యాలయానికి పంపగా అవి నకిలీవని ఎమ్మార్వో నిర్ధారించారని తెలిపారు. నకిలీ పట్టాల స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన జెడ్ సి పి సింహాచలం, రెవెన్యూ అధికారులు సిహెచ్ రామనారాయణ, మురళీధర్, ఆర్ వి అప్పారావు, ఎస్ కే సుబాన్, శివకుమార్, ఆయా వార్డుల అడ్మిన్ కార్యదర్శులను విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
