తిరువూరు కార్యకర్తల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని నారా భువనేశ్వరి తెలిపారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ముగింపు సందర్భంగా తిరువూరు దారా పూర్ణయ్య టౌన్షిప్ మైదానంలో శనివారం జరిగిన ‘ప్రజా ప్రభుత్వం రావాలి’ బహిరంగసభలో ఆమె మాట్లాడారు. కార్యకర్తలను కంటికి రెప్పలా పార్టీ చూసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ఎన్నడూ ప్రజల్లోకి వచ్చి మాట్లాడని తనకు ‘నిజం గెలవాలి’ పర్యటన సందర్భంగా కోడలు స్థానంలో ఉన్న బ్రాహ్మణి కూతురిగా బాసటగా నిలిచారని తెలిపారు
