అల్లూరి జిల్లా:9 మార్చ్ అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకులోయ మండలం గన్నెల రహదారిలో మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్ద బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
అరకులోయ-లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరుగుతోంది. ఆ జాతరకు వెళ్లి వస్తున్న రెండు బైక్‌లను అరకులోయ నుంచి వెళుతున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమలాకాంత్ (13) లోతేరు ప్రాంతానికి చెందిన త్రినాధ్ (32 ), భార్గవ్ (4)లు ప్రమాదంలో మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
