పార్వతీపురం మన్యం జిల్లా(ఆంధ్రప్రదేశ్), టిడిపి, జనసేన, బిజెపి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరిని టిడిపి అధిష్టానం మారుస్తారని కొద్దిరోజులుగా కొన్ని చానాల్స్, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అన్యాయమని గుమ్మలక్ష్మిపురం మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరిని మారుస్తారన్న అసత్య ప్రచారాలు టిడిపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దన్నారు.
ఆశావాహులతో చర్చించి కలిసికట్టుగా పనిచేసి కురుపాం నియోజకవర్గంలో జగదీశ్వరి గెలుపు కోసం కష్టపడి పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకురాలు కడ్రక కళావతి,దాసు, తదితరులు పాల్గొన్నారు
