


ప్రత్తిపాడు03 ఫిబ్రవరి : నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ వెన్నంటి నడుస్తున్న పోలీసు అధికారి ప్రత్తిపాడు ఎస్సై సోమేశ్వరరావు. శుక్రవారం ప్రత్తిపాడులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి కిరణ్ కుమార్ హాజరవ్వగా, ప్రభుత్వాధికారి అయిన ఎస్సై బందోబస్తుగా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రత్తిపాడు ఎస్సైగా సోమేశ్వరరావు వచ్చారు. బలసాని కిరణ్‌కుమార్ ప్రత్తిపాడు మండలంలో హాజరవుతున్న ప్రైవేటు కార్యక్రమాలకు వైకాపా నేతలతో కలిసి తరచూ ఆయన వెంట వెళ్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎస్సై తీరుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
